హరితహారంలో భాగంగా రహదారుల వెంట నాటిన మొక్కలను సంరక్షించడం, గ్రామాల్లోని నర్సరీలను పర్యవేక్షించాల్సిన బాధ్యత సర్పంచులదేనని అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామంలో నర్సరీలను ఆయన పరిశీలించాారు. ప్రతినెలా 7వ తేదీలోగా మొక్కలపై నివేదికలు పంపాలని అధికారులను ఆదేశించారు. మొక్కలకు ఉదయం, సాయంత్రం నీరందించాలని సూచించారు. ఎండిపోయిన వాటిస్థానంలో పెద్ద మొక్కలు నాటాలని, అప్పుడే లక్ష్యం నేరవేరుతుందన్నారు.
రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలి