కొత్త మేయర్ ఎన్నిక అనంతరం వరంగల్ మహానగర పాలకవర్గం సమావేశం జరిగింది. కార్పొరేషన్ అధికారుల మధ్య సమన్వయలోపంతో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని కార్పొరేటర్లు మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ముఖం చూపించుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కోట్ల రూపాయల నిధులు ఇచ్చినప్పటికీ విలీన గ్రామాల్లో తట్టెడు మట్టి పోయలేక పోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
వాడివేడిగా వరంగల్ కార్పొరేషన్ సమావేశం
వరంగల్ మహానగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. మేయర్ ఎన్నిక అనంతరం మొదటిసారిగా జరిగిన సమావేశంలో కార్పొరేటర్లు అధికారుల తీరుపై మండిపడ్డారు.
కార్పొరేషన్ సమావేశం