తెలంగాణ

telangana

By

Published : Jun 25, 2020, 1:25 PM IST

ETV Bharat / state

కన్నుల పండువగా భద్రకాళి శాకాంబరి ఉత్సవాలు

వరంగల్​ ప్రజల ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కొవిడ్​-19 నిబంధనలకు అనుగుణంగా హంగూ ఆర్భాటాలు, భక్తుల కోలాహలం లేకుండా వేడుకలు సాదాసీదాగా జరుగుతున్నాయి.

Shakambari Celebrations In Warangal Bhadrakali Temple
కన్నుల పండువగా భద్రకాళి శాకాంబరీ ఉత్సవాలు

వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రంలోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కన్నుల పండువగా సాగుతున్న ఉత్సవాలు కొవిడ్​-19 నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు. భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడం కోసం క్యూలైన్లలో కాకుండా.. భౌతిక దూరం పాటించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మాస్కు లేనిదే భక్తులను ఆలయంలోనికి అనుమతించడం లేదు.

ABOUT THE AUTHOR

...view details