తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా వ్యాపారం.. ఇప్పుడిదే ఆధారం

రోజురోజు విస్తరిస్తోన్న మహమ్మారి ధాటికి అన్ని వ్యాపారాలు తుడిచిపెట్టుకునిపోయాయి. కాగా ఇలాంటి విపత్కర పరిస్థితిని కొంతమంది వ్యాపారులు డబ్బుచేసుకుంటున్నారు. ఈ కష్టకాలంలో ప్రజల అవసరాలేంటో వాటిని బట్టి వ్యాపారం నిర్వహిస్తున్నారు. వైరస్​ బారి నుంచి ఎవరిని వారిని రక్షించుకోవడానికి అత్యవసరమైన మాస్కులు శానిటైజర్లు రోడ్ల వెంబడి అమ్ముతూ కాస్త డబ్బు కూడబెట్టుకుంటున్నారు.

road side business at corona time in waranngal
కరోనా వ్యాపారం.. ఇప్పుడిదే ఆధారం

By

Published : Jul 22, 2020, 5:20 PM IST

కరోనా వైరస్‌తో చిన్న, పెద్ద వ్యాపారాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఎక్కడా చూసినా భయంభయంగానే ఉంది. కొవిడ్‌ బారి నుంచి రక్షించుకోవాలంటే శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు, వైరస్‌ నిరోధక రసాయన ద్రావణాలు వాడక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో వీటి డిమాండ్‌ అమాంతంగా పెరుగుతోంది. దీనితో కొంతమందికి వీటి విక్రయం ఓ వ్యాపారంగానూ మారింది. పట్టణ ప్రాంతాల్లో రహదారుల వెంబడి విక్రయ కేంద్రాలు వెలుస్తున్నాయి. వరంగల్​ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల రహదారి వెంట ఓ విక్రయ కేంద్ర దృశ్యం ప్రస్తుత పరిస్థితికి అద్దం పట్టినట్టు కనిపిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details