వరంగల్ శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో శాసనమండలి ఎమ్మెల్సీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి ఆయన భద్రకాళి ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు చేయించారు. ఆలయానికి వచ్చిన నేతలకు ఆలయ ప్రధాన అర్చకుడు శేషు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం నామినేషన్ దాఖలు చేశారు. తెరాస పార్టీ అభిమానులు, కార్యకర్తలు శ్రీనివాస్ రెడ్డికి అభినందనలు తెలిపారు.
నామినేషన్ దాఖలు చేసిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
మండలి బరిలో ఉన్న తెరాస అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా వరంగల్ భద్రకాళీ ఆలయంలో నామపత్రాలకు ప్రత్యేక పూజలు చేయించి కలెక్టరేట్‌కు వచ్చారు.
నామినేషన్ పత్రాలకు పూజలు