మాదిగలను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. మాదిగల ఆత్మవిశ్వాసం దెబ్బతీసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 21న హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల మైదానంలో మాదిగల ఆవేదన పేరుతో వేలాది మందితో దీక్షలు చేపట్టబోతున్నామని మందకృష్ణ మాదిగ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్రంలోని మాదిగలు తరలిరావాలని కోరారు.
"మాదిగలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలి"
మాదిగల ఆత్మవిశ్వాసం దెబ్బతీసేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. మంత్రి వర్గంలో మాదిగలకు చోటు కల్పించాలని కోరారు.
మంద కృష్ణ మాదిగ