తెలంగాణ

telangana

ETV Bharat / state

న్యాయం చేయాలి.. ప్రతీకారం తీర్చుకోకూడదు:మందకృష్ణ

న్యాయవ్యవస్థ ద్వారానే శిక్షలు అమలుజరగాలని ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ అన్నారు. నిందితులను శిక్షించాలే గానీ ప్రతీకారం తీర్చుకునే విధంగా ఉండకూడదని మందకృష్ణ అభిప్రాయపడ్డారు.

manda krishna
న్యాయం చేయాలి.. ప్రతీకారం తీర్చుకోకూడదు:మందకృష్ణ

By

Published : Dec 20, 2019, 6:05 PM IST

మహిళలపై జరుగుతున్న దాడులపై న్యాయవ్యవస్థ ద్వారానే న్యాయం జరగాలని ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ అన్నారు. హన్మకొండలో ఎమ్మార్పీఎస్​ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఉమ్మడి సదస్సుకు ఆయన హాజరయ్యారు.

నిందితులను శిక్షించాలే గానీ ప్రతీకారం తీర్చుకునే విధంగా ఉండకూడదని తెలిపారు. హత్యాచారాల నియంత్రణకు పటిష్ట చట్టాలు రూపొందించాలని సూచించారు. నేరాలు వంద శాతం అరికట్టాల్సిందేనని కానీ శిక్షల్లో వ్యత్యాసం చూపకూడదని మందకృష్ణ పేర్కొన్నారు. ఈనెల 24న హైదరాబాద్​లో మహాదీక్ష చేస్తున్నట్లు మందకృష్ణ వెల్లడించారు.

న్యాయం చేయాలి.. ప్రతీకారం తీర్చుకోకూడదు:మందకృష్ణ
ఇవీచూడండి: ఉన్నావ్​ కేసు: బతికున్నంత కాలం జైల్లోనే సెంగార్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details