లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై వరంగల్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చిన 290 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కంటైన్మెంట్ ప్రాంతమైన చింతగట్టు క్యాంప్ కాకతీయ కాలనీలో అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ రవీందర్, మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ పమేలా సత్పతి ఇతర అధికారులు పర్యటించారు. ప్రజలకు నిత్యావసరాలు అందుతున్నాయా లేదా... ఇతర ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించారు.
వరంగల్‌లో పటిష్ఠంగా లాక్‌డౌన్ అమలు - వరంగల్ లాక్‌డౌన్
వరంగల్‌లో లాక్‌డౌన్ పటిష్ఠంగా అమలౌతోంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నగర కమిషనరేట్ పరిధిలో మంగళవారం 290 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కంటైన్‌మెంట్ జోన్లలో అధికారులు పర్యటించి... సమస్యలు తెలుసుకుంటున్నారు.

కరోనా లక్షణాలు కలిగిన అనుమానితులు ఉంటే వెంటనే క్వారెంటైన్‌కు తరలించాలని అధికారులను ఆదేశించారు. సోడియం హైపో క్లోరైట్ మందును అన్ని చోట్లా పిచికారీ చేయాలని కమిషనర్ సూచించారు. అనంతరం కాజీపేట విద్యానగర్‌లోని వలస కార్మికుల షెల్టర్‌ను సందర్శించారు. వారికి మాస్కులు, సబ్బులు ఇవ్వాలని... అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు పాలు అందించాలన్నారు. పంజాబ్, హర్యానా నుంచి ఇక్కడకు వచ్చామని అన్నం కాకుండా గోధుమపిండి ఇవ్వాలని కలెక్టర్‌ను వలస కార్మికులు కోరారు. వారికి గోధుమ పిండి ఇప్పించాలని ఆర్‌డీవోను కలెక్టర్ ఆదేశించారు.
ఇవీచూడండి:ఒక్కరోజులోనే భారత్‌లో 1211 కరోనా కేసులు