సుమారు రెండు నెలల తరువాత వరంగల్‌నగరంలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్‌గా మారటం వల్ల ప్రభుత్వ సూచనలతో లాక్డౌన్ ఆంక్షలు సడలించారు. ప్రజారవాణాకు, దుకాణాలకు అనుమతి లభించడం వల్ల రోడ్లపై సందడి నెలకొంది.
తెరుచుకున్న దుకాణాలు, రోడ్డెక్కిన వాహనాలు - వరంగల్‌లో తెరుచుకున్న దుకాణాలు
వరంగల్ నగరంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. రెడ్‌జోన్ నుంచి గ్రీన్‌జోన్‌కు మారడం వల్ల సుమారు రెండు నెలల తర్వాత రోడ్లపై జనసంచారం పెరిగింది. లాక్డౌన్ ఆంక్షలు సడలించడం వల్ల దుకాణాలు తెరుచుకున్నాయి. రోడ్లపై వాహనాల సందడి నెలకొంది.

తెరుచుకున్న దుకాణాలు, రోడ్డెక్కిన వాహనాలు
వరంగల్, హన్మకొండ, కాజీపేటలోని ప్రధాన కూడళ్ల వద్ద రద్దీ నెలకొంది. ఆటోళ్లో ఇద్దరు ప్రయాణికులకు మించి అనుమతించడం లేదు. ఇన్నాళ్లూ మూతపడిన దుకాణాలు తెరుచుకుంటున్నాయి. షాపుల్లో రద్దీ మాత్రం స్వల్పంగానే ఉంది. భౌతిక దూరం పాటించేలా యజమానులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మాస్కులున్నవారినే లోపలికి అనుమతిస్తున్నారు. కొనుగోలుకు వచ్చినవారందరికీ శానిటైజర్లను అందుబాటులో ఉంచారు.
ఇవీ చూడండి:కేంద్రం ప్యాకేజీ డొల్ల... ముఖ్యమంత్రి గుస్సా