Locals Protest for Formation of Separate District Parakala : ఒకప్పుడు ఆ ప్రాంతం విద్యా, వైద్యం, వ్యాపారంతో పాటు వివిధ అవసరాల నిమిత్తం వేలాది మంది వచ్చిపోతూ నిత్యం ప్రజలతో కళకళలాడుతూ ఉండేది. చుట్టుపక్కల మండలాలతో అతిపెద్ద తాలూకాగా పేరేన్నిక గన్న ఆ ప్రాంతం జిల్లాల విభజన తర్వాత కాలక్రమేణా ఆ ప్రాంతానికి రాకపోకలు తగ్గిపోయాయి. ఆరోగ్యరీత్యా అత్యవసర సమయంలో వేరే రాష్ట్రం నుంచి ఈ ప్రాంతానికి వచ్చి చికిత్స చేసుకొని వెళ్లేవారు. అది మరెదో కాదు హనుమకొండ జిల్లాలోని పరకాల.
Parakala Amaradhamam : నాటి అమరవీరుల త్యాగాలకు గుర్తుగా పరకాల అమరదామం.. ఈ విశేషాలు తెలుసా..?
District of Martyrs in Telangana :గతంలో ఈప్రాంతంలో విలీనమై ఉన్న మండలాలు ప్రస్తుతానికి జిల్లాలుగా మారాయి. కానీ తాలూకాగా ఎంతో పేరున్న ఈ ప్రాంతం మాత్రం జిల్లాగా కాకుండా మున్సిపాలిటీగా మిగిలిపోయింది. హనుమకొండ జిల్లా(Hanmakonda) పరకాల ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంది. ఉద్యమాలకు పుట్టినిల్లుగా ఎంతో పేరున్న ప్రాంతం పరకాల. ఒకప్పుడు పరకాల ప్రాంతం చుట్టూ ఉన్న మండలాలతో కలిసి అతిపెద్ద తాలూకాగా ఉండేది.
పరకాల తాలూకా పరిధిలో ఉన్న మండలాలు కొన్ని జిల్లాలుగా మారాయి. గతంలో ఎలాంటి సరుకులు కొనుగోలు చేయాలన్న కిరాణం షాపు నుంచి మొదలుకుని బట్టలు, పాఠశాల, కళాశాలలతో పాటు వివిధ రకాల పనుల కోసం పరకాల ప్రాంతానికి ఎంతో మంది వచ్చి పోయేవారు. దాంతో స్థానికంగా వ్యాపారాలు ఎంతో సజావుగా సాగేవి. జిల్లాల విభజన సమయంలో పరకాల ప్రాంతం మున్సిపాలిటీకే పరిమితం అయ్యింది.