తెలంగాణ

telangana

ETV Bharat / state

మా బస్సు బిల్లులు చెల్లించండి: అద్దె బస్సుల యజమానులు

వరంగల్​ జిల్లా హన్మకొండ బస్టాండ్​లోని రీజినల్​ మేనేజర్​ కార్యాలయం ఎదుట అద్దె బస్సుల యజమానులు ధర్నా చేపట్టారు. పెండింగ్​లో ఉన్న అద్దె బస్సుల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్​ చేశారు.

lease buses owners protest at infront of rtc warangal reginoal manager office
మా బస్సు బిల్లులను చెల్లించండి: అద్దె బస్సుల యజమానులు

By

Published : Jun 18, 2020, 9:55 AM IST

వరంగల్​లో అద్దె బస్సుల యజమానులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హన్మకొండ బస్టాండ్​లోని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

లాక్​డౌన్ కాలానికి అగ్రిమెంట్ ప్రకారంగా అద్దె బస్సుల బిల్లులను తక్షణమే చెల్లిచాలని కోరారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్​ చేస్తూ వరంగల్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్​కు వినతిపత్రం అందజేశారు.

ఇదీ చదవండి:లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్‌ సందేహానికి ప్రధాని స్పష్టత

ABOUT THE AUTHOR

...view details