Telugu Young man washed away in Germany river: హనుమకొండ జిల్లా కరీమాబాద్‌కు చెందిన కడారి అఖిల్.. జర్మనీలోని ఓ నదిలో కొట్టుకుపోయాడు. పై చదువుల కోసం జర్మనీ వెళ్లిన అఖిల్ ప్రమాదవశాత్తు నదిలో గల్లంతయ్యాడు. ప్రమాదం విషయాన్ని మంత్రి కేటీఆర్‌కు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ట్వీట్ చేశారు. అఖిల్‌ను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో స్పందించిన మంత్రి.. వెంటనే జర్మనీ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అఖిల్ కోసం గాలింపు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
జర్మనీలోని నదిలో గల్లంతైన వరంగల్ యువకుడు
Telugu Young man washed away in Germany river: హనుమకొండ జిల్లా కరీమాబాద్ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పై చదువుల కోసం జర్మనీకి వెళ్లిన కరీమాబాద్‌కు చెందిన కడారి అఖిల్.. ప్రమాదవశాత్తు అక్కడ నదిలో కొట్టుకుపోయాడు. స్పందించిన మంత్రి కేటీఆర్.. జర్మనీ అధికారులతో మాట్లాడారు.
జర్మనీలో నదిలో కొట్టుకుపోయిన అఖిల్
ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తమ కుమారుడు నీళ్లలో కొట్టుకుపోవడంతో అఖిల్ కుటుంబంతో పాటు బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. అఖిల్ కుటుంబాన్ని ఎమ్మెల్యే నన్నపనేని పరామర్శించారు. తమ కుమారుడిని రక్షించేలా చర్యలు తీసుకోవాలని అఖిల్ తల్లిదండ్రులు ఎమ్మెల్యేను వేడుకున్నారు.
ఇవీ చదవండి:పాలమూరు పచ్చబడితే కొంతమంది కళ్లు ఎర్రబడుతున్నాయి: కేటీఆర్