వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ గుండా ప్రకాష్ ఇంటింటికి మాస్కులను పంపిణీ చేస్తున్నారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడాలంటే విధిగా భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు చేతి తొడుగులు, మాస్కులను ఉపయోగించాలని మేయర్ సూచించారు.
ఇంటింటికి మాస్కులు పంపిణీ చేస్తున్న మేయర్ - corona virus latest news
కరోనా మహమ్మారి నుంచి బయటపడాలంటే భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ గుండా ప్రకాష్ సూచించారు. వరంగల్ కరీమాబాద్‌లోని 24వ డివిజన్లో మేయర్ ప్రజలకు మాస్కులను పంపిణీ చేశారు.

ఇంటింటికి మాస్కులు పంపిణీ చేస్తున్న మేయర్
నగర పాలక సంస్థ ద్వారా ప్రతి ఇంటికి రెండు మాస్కులను పంపిణీ చేస్తున్నారు. వరంగల్ కరీమాబాద్‌లోని 24వ డివిజన్లో మాస్కుల పంపిణీ కార్యక్రమంలో మేయర్ గుండా ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు మాస్కులను అందించారు.
ఇవీ చూడండి: కన్నీటి గాథపై స్పందించిన మానవత్వం