లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సాయం చేయడానికి దాతలు ముందుకొస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఐఎన్టీయూసీ అనుబంధ 327 యూనియన్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీధర్ ఆధ్వర్యంలో విద్యుత్తు కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
విద్యుత్ కార్మికులకు నిత్యావసరాల పంపిణీ - వరంగల్లోని విద్యుత్ కార్మికులకు
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని విద్యుత్ కార్మికులను నిత్యావసరాలను ఐఎన్టీయూసీ అనుబంధ 327 యూనియన్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీధర్ పంపిణీ చేశారు.

విద్యుత్ కార్మికులకు నిత్యావసరాల పంపిణీ
ప్రతి ఒక్కరు స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు. ప్రజలందరూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలని శ్రీధర్ కోరారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని తెలిపారు.
ఇవీ చూడండి:మే ఆఖరుకు 4 కోట్ల మంది చేతిలో మొబైళ్లుండవ్!