తెలంగాణ

telangana

ETV Bharat / state

తల్లిదండ్రులు తిట్టారని ఇంటి నుంచి వెళ్లి పోయిన చిన్నారి - వరంగల్​ అర్బన్​ తాజా కబురు

తల్లిదండ్రులు మందలించడం వల్ల 7వ తరగతి చదువుతున్న శ్రావ్య అనే విద్యార్థిని ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట​లో చోటుచేసుకుంది.

girl-missing-in-warangal-urban
తల్లిదండ్రులు మందలించారని ఇంటి నుంచి వెళ్లి పోయిన చిన్నారి

By

Published : Dec 2, 2019, 9:38 AM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా కాజీపేట సిద్ధార్థ్​ నగర్​లో తల్లిదండ్రులు మందలించారనే కారణం వల్ల ఏడో తరగతి చదువుతున్న శ్రావ్య అనే విద్యార్థిని ఇంటి నుంచి వెళ్లిపోయింది. రేవతి, రవికుమార్ దంపతులకు శ్రావ్య, పరశురామ్ సంతానం. ఆదివారం ఉదయం శ్రావ్య సోదరుడు పాదరక్షలు తగిలి కిందపడి తలకు గాయమయ్యింది. ఈ విషయంలో తల్లిదండ్రులు శ్రావ్యను మందలించి... ఆమె సోదరున్ని ఆస్పత్రికి తీసుకొని వెళ్లారు.

తల్లిదండ్రులు మందలించడం వల్ల దు:ఖానికి గురైన శ్రావ్య... వారు లేని సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆస్పత్రి నుంచి తిరిగివచ్చిన శ్రావ్య తల్లిదండ్రులు చుట్టుపక్కల ఇళ్లల్లో, బంధువుల ఇళ్లల్లో వెతికినప్పటికీ ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. దీనితో కాజీపేట్ పట్టణ పోలీసులకు శ్రావ్య అదృశ్యంపై ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

తల్లిదండ్రులు మందలించారని ఇంటి నుంచి వెళ్లి పోయిన చిన్నారి

ఇదీ చూడండి: అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్ కార్యాలయ అటెండర్‌ మృతి

ABOUT THE AUTHOR

...view details