మావోయిస్టుల పేరుతో పెద్ద రైతులు, భూస్వాములు, వ్యాపారులను బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న 8 మంది సభ్యుల నకిలీ నక్సలైట్ల ముఠాను వరంగల్ పట్టణ జిల్లా మడికొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు రెండు బృందాలుగా విడిపోయి ఈ కలాపాలు నడిపినట్లు వరంగల్ టాస్క్ఫోర్స్ అడిషనల్ డీసీపీ తెలిపారు. వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వ్యక్తులను కిడ్నాప్ చేసి నగదు వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. ఈ మేరకు వరంగల్ టాస్క్ఫోర్స్, మడికొండ, ధర్మసాగర్ పోలీసులు నిఘాను తీవ్రతరం చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. అదుపులోకి తీసుకున్న నిందితులు 8 మంది వరంగల్ జిల్లాకు చెందిన వారేనని తెలిపారు. వారి వద్ద నుంచి 3 నాటు తుపాకులు, 60 వేల నగదు, ఒక నకిలీ బంగారు ప్రతిమ, 8 సెల్ ఫోన్లు, రెండు ఆటోలు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిలో వరంగల్ రూరల్ జిల్లా పరకాలకు చెందిన ప్రధాన నిందితుడు తేలుకుంట్ల భిక్షపతికి గతంలో మావోయిస్టులతో సంబంధం ఉండేదని... ఇతను పలు కేసుల్లో అరెస్టయి జైలుకు కూడా వెళ్లి వచ్చాడని పోలీసులు తెలిపారు.
8మంది సభ్యులు గల నకిలీ నక్సలైట్ల ముఠా అరెస్టు
మావోయిస్టుల పేరుతో దోపిడీలకు పాల్పడుతున్న8మంది గల నకిలీ నక్సలైట్ల ముఠాను మడికొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు వరంగల్ జిల్లాకు చెందిన వారేనని పోలీసులు తెలిపారు.
8మంది సభ్యులు గల నకిలీ నక్సలైట్ల ముఠా అరెస్టు