Congress MLA Tickets War in Warangal :కాంగ్రెస్ రెండో జాబితావెల్లడితో బరిలో ఎవరున్నారనే అంశంపై స్పష్టత వచ్చింది. ఓరుగల్లు జిల్లాలో టికెట్ కోసం ఎదురుచూసిన ఆశావహుల్లో కొందరిని అదృష్టం వరించగా.. మరికొందరిని దురదృష్టం వెంటాడింది. ఆ పార్టీ నుంచి చివరి నిమిషంలో ఈ పార్టీలోకి వచ్చిన వారికి టికెట్ రాగా.. అమెరికాలో ఉండి మరో అభ్యర్థి టిక్కెట్ దక్కించుకోవడం విశేషం. సీటు పొందిన వారు సేవ చేస్తామని చెబుతుండగా.. అవకాశం రాని వారు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు.
Warangal Congress MLA Tickets War :వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి నాయని రాజేందర్‌రెడ్డి, జంగారాఘవరెడ్డి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆఖరి నిమిషంలో డీసీసీ అధ్యక్షుడు నాయనికే అదృష్టం దక్కింది. టికెట్ వచ్చిన సంతోషంలో నాయని వర్గీయులు ఉండగా జంగా అనుచరులు నైరాశ్యంలో మునిగిపోయారు. 2004 నుంచి టికెట్ వస్తుందని చివరి నిమిషం వరకు చూసి ఉసూరుమనడం నాయని రాజేందర్‌రెడ్డికి పరిపాటిగా మారింది. 2018లో టీడీపీ పొత్తుతో పేరు గల్లంతుకాగా.. ఈసారి మాత్రం నాయని కల నెరివేరినట్లైంది. వరంగల్ పశ్చిమ స్థానంపై గంపెడాశతో ప్రచారపర్వంలో దూసుకెళుతున్న జంగారాఘవరెడ్డి దారి ఎటు అన్నది చర్చనీయాంశమైంది. ప్రస్తుతం భవిష్యత్ కార్యాచరణపై రాంపూర్‌లో ముఖ్య కార్యక్తరలతో జంగా సమాలోచనలు జరుపుతున్నారు.
Congress MLA Candidates List 2023 :జనగామ జిల్లా పాలకుర్తిలో కాంగ్రెస్(Telangana Congress)నుంచి మామిడాల యశస్విని బరిలో దిగనున్నారు. యశస్విని తొలిసారిగా పోటీచేస్తూ.. రాజకీయ ఉద్దండుడిగా ఉన్న మంత్రి ఎర్రెబెల్లి దయాకరరావును ఢీ కొంటున్నారు. ఆ టికెట్‌ను ఎన్ఆఐ ఝాన్సీరెడ్డి ఆశించారు. ఎన్నికల షెడ్యూల్ వెలవడకముందునుంచే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించినా.. భారత పౌరసత్వం లభించలేదు. తనకు కాకున్నా కోడలు యశస్వినిరెడ్డికి ఇవ్వాలని అధిష్ఠానంముందు ప్రతిపాదించగా.. అందుకు దిల్లీ పెద్దల అంగీకారంతో అమెరికాలో ఉన్న యశస్వినిరెడ్డికి పాలకుర్తి టికెట్ వరించింది. 26 ఏళ్ల యశస్విని సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావును ఎదుర్కొవడం ఆసక్తికరంగా మారింది.
Congress Ticket War in Karimnagar : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ టికెట్లు దక్కించుకునేదెవరు..?