చాణక్య ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో జాతీయ స్థాయిలో ఉత్తమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అవార్డు అందుకున్న చల్లా ధర్మారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. సెప్టెంబర్ 26న దిల్లీలో కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి, పద్మభూషణ్ మురళి మనోహర్ జోషి గారి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. మంగళవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఉత్తమ ఎమ్మెల్యేగా ఎంపికైనందున ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని అభినందించారు.
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని అభినందించిన సీఎం - ఉత్తమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అవార్డు అందుకున్న చల్లా ధర్మారెడ్డి
జాతీయ స్థాయిలో ఉత్తమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎంపికైన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు.

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని అభినందించిన సీఎం
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని అభినందించిన సీఎం
Last Updated : Oct 23, 2019, 12:01 PM IST