రైతు వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా.. రైతులకు మద్దతుగా పోరాటం చేస్తామని వరంగల్ గ్రామీణ జిల్లా ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల 29న కలెక్టరేట్ ఎదుట ఒక రోజు దీక్ష చేపట్టబోతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తోన్న రైతు వ్యతిరేక విధానాలపై పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఆరూరి రమేష్ హన్మకొండలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
'నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 29న ఒకరోజు దీక్ష'
కేంద్రం అవలంభిస్తోన్న రైతు వ్యతిరేక విధానాలపై హన్మకొండలో వరంగల్ గ్రామీణ జిల్లా ఎమ్మెల్యేలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, ఆరూరి రమేష్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ మేరకు ఈ నెల 29న కలెక్టరేట్ ఎదుట ఒకరోజు దీక్ష చేపట్టబోతున్నట్లు తెలిపారు.
'నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 29న ఒకరోజు దీక్ష'
రాష్ట్రంలో రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో రైతులకు ప్రభుత్వం బాసటగా నిలుస్తుంటే కేంద్రం మాత్రం రైతుల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తోందని ఎమ్మెల్యేలు ఆరోపించారు. నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఆగం చేసేందుకే ఈ చట్టాలను తీసుకువచ్చిందని మండిపడ్డారు. దేవాదుల మూడవ దశ పనులను కేంద్ర ప్రభుత్వం ఆపడం దుర్మార్గమని... వెంటనే పనులకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:'భాజపా నేతలు బ్లాక్‌మెయిల్ రాజకీయాలు మానుకోవాలి'