వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలంలోని గవిచర్లలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటించారు. ఓడీసీఎమ్ఎస్ కేంద్రంలో రైతులకు మొక్కజొన్న రవాణా ఖర్చులకు సంబంధించి చెక్కులను పంపిణీ చేశారు.
రైతులకు మొక్కజొన్న రవాణా ఖర్చుల చెక్కుల పంపిణీ - mla challa dharma reddy visit to gavicherla
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లప్పుడు రైతులకు అండగా ఉంటారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలంలోని గవిచర్లలో కర్షకులకు మొక్కజొన్న రవాణా ఖర్చులకు సంబంధించి చెక్కులను అందజేశారు.

రైతులకు మొక్కజొన్న రవాణా ఖర్చుల చెక్కుల పంపిణీ
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లప్పుడు రైతులకు అండగా ఉంటారని ధర్మారెడ్డి అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మొక్కజొన్న కొనుగోలు చేశామని తెలిపారు. కరోనా ఆపత్కాలంలోనూ.. రైతులు పండించిన మొక్కజొన్న, వరి ధాన్యాలకు మద్దతు ధర కలిపించి, కొనుగోలు చేశామని వెల్లడించారు. ఇటీవల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంగెం మండల జడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి, సంగెం మండల రైతు సమన్వయ సమితి కమిటీ అధ్యక్షుడు కందకట్ల నరహరి పాల్గొన్నారు.