వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల పట్టణాభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కోరారు. ఈ రోజు ఉదయం 6 గంటలకే పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్ దగ్గరలోని కాలనీల్లో పర్యటించారు. పారిశుధ్య నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇరుకుగా ఉన్న సందుల్లో రోడ్ల వెడల్పునకు, మురికి కాల్వల నిర్మాణ పనులకు ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానం చేసుకోవాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఇళ్లు కోల్పోతున్న వారందరికీ డబుల్ బెడ్రూంలు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హామీ ఇచ్చారు.
వేకువజామునే ఎమ్మెల్యే ధర్మారెడ్డి పర్యటన
వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెల్లవారుజామునే పర్యటించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
వేకువజామునే ఎమ్మెల్యే ధర్మారెడ్డి పర్యటన