తెలంగాణ

telangana

ETV Bharat / state

ప‌ట్ట‌భద్రుల స‌న్నాహ‌క సమావేశంలో పాల్గొన్న మంత్రి - రాయపర్తిలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి

వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, నల్గొండ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేయాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెరాస పార్టీ శ్రేణుల‌కు సూచించారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ప‌ట్ట‌భద్రుల స‌న్నాహ‌క సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Minister errabelli participating in the preparatory meeting of mlc graduates at rayaparthi
ప‌ట్ట‌భద్రుల స‌న్నాహ‌క సమావేశంలో పాల్గొన్న మంత్రి

By

Published : Sep 27, 2020, 6:03 PM IST

ప‌క‌డ్బందీగా ఓట్ల న‌మోదు చేయ‌డంతోపాటు వ‌చ్చే వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, నల్గొండ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేయాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పార్టీ శ్రేణుల‌కు సూచించారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ప‌ట్ట‌భద్రుల స‌న్నాహ‌క సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత ప్ర‌తి ఎన్నిక‌లోనూ తెరాస విజ‌య‌ం సాధిస్తుందన్నారు. ఆ ఒర‌వ‌డిని కొన‌సాగించాల‌ని పార్టీ శ్రేణుల‌కు మంత్రి ఎర్ర‌బెల్లి తెలిపారు. ప‌ట్ట‌భ‌ద్రుల‌ను గుర్తించ‌డం, వారిని ఓట‌ర్లుగా న‌మోదు చేయ‌డం చేయాలన్నారు. పట్టభద్రులు తెరాస అభ్య‌ర్థికే ఓటు వేసే విధంగా పార్టీ శ్రేణులు బాధ్యతలు తీసుకోవాల‌న్నారు.

గ్రామాల్లో వార్డులు, బూత్​ల వారీగా ఇప్ప‌టికే ఇన్​ఛార్జుల‌ను పెట్టామన్నారు. వారంతా వారివారి క్షేత్రాల్లో ప‌నులు నిర్వ‌ర్తించాల‌ని చెప్పారు. ఏవైనా స‌మ‌స్య‌లుంటే, వెంట‌నే త‌మ దృష్టికి తేవాల‌న్నారు. నిర్ల‌క్ష్యంగా ప‌ని చేస్తే వారిని క్ష‌మించేది లేద‌ని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి :'ప్రేమించిన యువతిని ఎన్‌కౌంటర్ చేస్తానన్న ప్రియుడు'

ABOUT THE AUTHOR

...view details