వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం పరిధిలోని పలు గ్రామాల్లో అకాల వడగళ్ల వర్షంతో రైతులకు తీవ్ర పంట నష్టం వాటిల్లింది. పంట నష్టపోయిన అన్నదాతలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు.
పంట నష్టం వివరాలు ప్రభుత్వానికి నివేదించండి: ఎర్రబెల్లి - మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. గురువారం వడగళ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

పంట నష్టం వివరాలు ప్రభుత్వానికి నివేదించండి: ఎర్రబెల్లి
పంట నష్టం వివరాలు ప్రభుత్వానికి నివేదించండి: ఎర్రబెల్లి
గురువారం కురిసిన వడగళ్ల వర్షానికి వందల ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టం అయింది. విషయం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి.. జిల్లా కలెక్టర్‌తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పంట నష్టం పూర్తి వివరాలను అధికారులు త్వరితగిన సేకరించి ప్రభుత్వానికి నివేదించాలని ఎర్రబెల్లి ఆదేశించారు.
ఇదీ చూడండి:కరోనా ఎఫెక్ట్: రేపు కరీంనగర్‌లో సీఎం పర్యటన