తెలంగాణ

telangana

ETV Bharat / state

సర్కారు బడి అంటే ఇట్లా ఉండాలే... - వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి

అధునాతన సౌకర్యాలు, డిజిటల్​ తరగతులు, 286 మంది విద్యార్థులు, 12 మంది ఉపాధ్యాయులు... ఇవన్నీ ఎక్కడో కార్పొరేట్​ బడి అనుకుంటున్నారేమో...! కాదు వరంగల్​ గ్రామీణ జిల్లా కొండూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలోనే.

సర్కారు బడులంటే ఇట్లా ఉండాలే...

By

Published : Mar 28, 2019, 11:55 AM IST

సర్కారు బడులంటే ఇట్లా ఉండాలే...
ప్రభుత్వ బడులంటే వసతులుండవా... ఉపాధ్యాయులు సమయానికి రారా... నాణ్యమైన విద్యాబోధన ఉండదా... సర్కారు బడులపై ఇవే మీ అభిప్రాయాలైతే... ఈ పాఠశాలను చూస్తే వెంటనే మారిపోతాయ్​. పిల్లలను ఇక్కడే చదివించాలని నిర్ణయానికి వచ్చేస్తారు. ఇదే వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని కొండూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల.

గతంలో ఈ పాఠశాలలో 50 మంది విద్యార్థులు ఉండేవారు. ఉపాధ్యాయులు ఎంత కృషిచేసినా వసతులలేమితో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇక్కడ చేర్పించేందుకు ముందుకు వచ్చేవారు కాదు.

డిజిటల్​ తరగతులు

విద్యాభివృద్ధితో పాటు వసతులపై దృష్టిసారించాలని కొండూరు పాఠశాల ఉపాధ్యాయులు నిర్ణయించారు. నిత్యం పాఠశాలకు హాజరై... విద్యార్థులను పూర్తిగా చదువు పైనే దృష్టిసారించేటట్లు చేశారు. అభయ ఫౌండేషన్​, స్మైల్స్​ సంస్థలు ముందుకు వచ్చాయి. డిజిటల్​ తరగతులకు పరికరాలు, ఇతర సదుపాయాలు కల్పించాయి. గ్రామస్థులు సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు వచ్చారు..

తమ ప్రభుత్వ పాఠశాలలో మేటి సౌకర్యాలు ఉండడంపై విద్యార్థులు, గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రసుత్తం ఇక్కడ 286 మంది విద్యార్థులు, 12 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. జిల్లాలోనే అత్యధిక విద్యార్థులున్న సర్కారు బడిగా కొండూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలగా గుర్తింపు పొందింది.
ఇవీ చూడండి:సీఎల్పీ విలీనం కోసం తెరాస వ్యూహరచన

ABOUT THE AUTHOR

...view details