ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పాకాల ఆయకట్టు రైతుల కల నేడు సాకారమైంది. తెరాస ప్రభుత్వం, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కృషితో గోదావరి జలాలు పాకాల సరస్సును ముద్దాడాయి. ఈ సందర్భంగా వరంగల్ రూరల్ జిల్లా దబ్బవాగు బ్రిడ్జి దగ్గర గోదావరి జలాలకు ఎమ్మెల్యే సంతోషంతో పూలు చల్లారు.
పాకాల సరస్సు కింద ఖానాపురం, చెన్నారావుపేట, నర్సంపేట మండల పరిధిల్లో దాదాపు 30,000 ఎకరాల్లో వరి సాగు అవుతోంది. పూర్తిస్థాయిలో చెరువు నిండినా రెండో పంటకు మాత్రం రొటేషన్ పద్ధతిలోనే నీరు విడుదల చేసేవారు. ఈ క్రమంలో కొంతమంది రైతులు రెండో పంట సాగుచేసినా చివరి దశలో నీటి ఎద్దడి ఏర్పడేదని రైతులు తెలిపారు.