వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన బోయినలక్ష్మి, బస్స సారమ్మలకు వారం రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రభుత్వం కరోనా బాధితులకు ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆ కుటుంబ సభ్యులు అందరూ ఒకే ఇంట్లో ఉండలేక... కుటుంబ సభ్యులకు దూరంగా ఊరు చివరన ట్రాక్టర్‌పై నివాసం ఉంటున్నారు.
కుటుంబంలో కరోనా చిచ్చు... ఊరికి దూరంగా గుడారాలు
తలో పని చేసుకుంటూ... ఆనందంగా గడుపుతూ... ఉండే ఆ కుటుంబాల్లో కరోనా మహమ్మారి చిచ్చు పెట్టింది. ఒకే ఇంట్లో అన్యోన్యంగా కలిసుండే వారికి కరోనా మనో వేదనను మిగిల్చింది. పదిరోజుల క్రితం ఆ ఇంట్లో ఇద్దరికి కరోనా సోకింది. స్థానికంగా ఐసోలేషన్ కేంద్రాలు లేకపోవడంతో... ఇద్దరు కుమారులు, కోడళ్లు, వారి పిల్లలతో ఊరికి 2కిలోమీటర్ల దూరంలో గూడారాలు వేసుకుని జీవిస్తున్నారు.
corona
ఎండకు ఎండుతూ.. వర్షానికి తడుస్తూ.. అనేక ఇబ్బందులు పడుతున్నా.. వారిని పట్టించుకునే నాథుడే లేదు. నిత్యవసర సరకులకు దుకాణాలకు వెళ్తే... సరుకులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి... తమ కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నారు.
- ఇదీ చూడండి: గాంధీలో కేసీఆర్... రోగులకు ధైర్యం చెప్పిన సీఎం