తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్‌డౌన్‌ విధిగా పాటించాలి : ఎమ్మెల్యే ధర్మారెడ్డి - Parakala corn Purchase Centers

ప్రజలందరూ లాక్‌డౌన్‌ విధిగా పాటించాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కోరారు. దామెర మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ధర్మారెడ్డి
మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ధర్మారెడ్డి

By

Published : Apr 11, 2020, 11:20 AM IST

ప్రాణాల కంటే విలువైనదేదీ లేదని... ప్రజలందరూ విధిగా లాక్‌డౌన్‌ పాటించాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. పెద్దాపూర్ పీఏసీఎస్‌ పరిధిలోని దామెర మండలంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రాల దగ్గర అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

రైతులు అధైర్య పడవద్దని... ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులకు సకాలంలో పంటకు నీరు అందించామని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేస్తామని తెలిపారు. ప్రజలందరు భౌతికదూరం పాటించాలని కోరారు.

ఇదీ చూడండి:-14 రోజుల తర్వాత కూడా కరోనా లక్షణాలు!

ABOUT THE AUTHOR

...view details