ఒక్కో సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీ నాగరాజు, పరకాల ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం తక్కెళ్ళపాడులో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. అమ్మాయిలు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారాన్ని అపరిచిత వ్యక్తులకు తెలపరాదని ఏదైనా సమస్య ఉంటే 100కి డయల్ చేయాలని సూచించారు. నేర నియంత్రణలో సీసీ కెమెరాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని, ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
'ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం'
వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం తక్కెళ్ళపాడులో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీ నాగరాజు, పరకాల ఏసీపీ శ్రీనివాస్ ప్రారంభించారు.
సీసీ కెమెరాల ప్రారంభం