తెలంగాణ

telangana

By

Published : Jun 7, 2020, 12:21 AM IST

ETV Bharat / state

'ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిరంతరం కొనసాగించాలి'

ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 182జీవోను తప్పనిసరిగా అనుసరించాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా అధికారులను ఆదేశించారు. వనపర్తి ఎంపీడీవో కార్యాలయంలో పారిశుద్ధ్య, హరితహారం కార్యక్రమాలపై సమీక్షించారు.

vanaparthi-reviewed-sanitation-and-greenery-programs-at-mpdo-office
'ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిరంతరం కొనసాగించాలి'

వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్నీ.. ఈ నెల 8వ తేదీ తర్వాత కూడా నిరంతరం కొనసాగించాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా మండల అధికారులను ఆదేశించారు. వనపర్తి ఎంపీడీవో కార్యాలయంలో పారిశుద్ధ్య, హరితహారం కార్యక్రమాలపై సమీక్షించారు.

ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 182 జీవోను తప్పనిసరిగా అనుసరించాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. వారం రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంపై గ్రామాలను ఏ, బి, సీ కేటగిరిలుగా విభజించాలని పేర్కొన్నారు. శానిటేషన్, హరితహారాన్ని నూరు శాతం నిబద్ధతతో అధికారులు పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీపీవో రాజేశ్వరి, డీఎంహెచ్​వో శ్రీనివాసులు, డీఆర్డీవో గణేశ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో ఈరోజు 206 మందికి కరోనా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details