మనిషి మనుగడ ఉన్నంత కాలం రైతు ఇబ్బందులు లేకుండా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతుకు కావాల్సిన అన్ని పథకాలు ప్రవేశపెడుతూ.. నూతన రెవెన్యూ చట్టాన్ని అమలు చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. రెవెన్యూ చట్టానికి మద్దతుగా వనపర్తి జిల్లా కేంద్రానికి అన్ని మండలాల నుంచి ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు.
'రైతులు ఇబ్బంది పడకుండా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయం'
నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీని వనపర్తి జిల్లా పెబ్బెరులో మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రక్తశిబిరాన్ని ప్రారంభించారు.
పెబ్బేరులో మంత్రి నిరంజన్‌రెడ్డి ట్రాక్టర్ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ప్రపంచంలో ఏ రాష్ట్రంలో లేని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ రైతులకు మద్దతుగా తెరాస ప్రభుత్వం నిలుస్తోందని తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు రాములు, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు మందా జగన్నాథం, వనపర్తి జడ్పీ ఛైర్మన్ లోక్‌నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.