తెలంగాణ

telangana

ETV Bharat / state

MINISTER NIRANJAN REDDY: రైతు సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్​ పాలన

ముఖ్యమంత్రి కేసీఆర్​ రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉద్దేశాలను శిక్షణ రూపంలో చేరవేయడానికి రైతువేదికలు ఉపయోగపడతాయని ఆయన అన్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని పలు రైతు వేదికలను ప్రారంభించారు.

మంత్రి నిరంజన్​రెడ్డి
మంత్రి నిరంజన్​రెడ్డి

By

Published : Jun 20, 2021, 10:45 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాల మూలంగానే రాష్ట్ర వ్యవసాయ స్వరూపం మారిందని మంత్రి నిరంజన్​రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం నేడు అన్నపూర్ణగా మారిందని తెలిపారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని కంచిరావుపల్లి, కంభల్లాపురం, శ్రీరంగాపురం, వెంకటాపూర్, గుమ్మడం, సూగూరు, జనం పల్లి, రంగాపూర్, షాగాపూర్​లో రైతు వేదికలను ప్రారంభించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రైతు వేదికల నిర్మాణాలు చేపట్టారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో రైతువేదికలలో సేద్యం గురించి చర్చించుకోవాలన్నారు. రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో రైతుబీమా, రైతుబంధు పథకాలను సీఎం కేసీఆర్​ ప్రవేశపెట్టారని తెలిపారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పప్పు దినుసులు, నూనె గింజల పంటలు , పత్తి, కంది పండించాలని కోరారు.

ఇదీ చదవండి:Cm Kcr Story: సీఎం కేసీఆర్ చెప్పిన కలియుగ రాక్షసుల కథ

ABOUT THE AUTHOR

...view details