వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ బస్సులో ప్రయాణించారు. ప్రయాణికుల సమస్యలు తెలుసుకోవడానికి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. సమ్మె విరమణ తర్వాత గత నెల 30న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో భేటీ సందర్భంగా.. ప్రజాప్రతినిధులు రెండు, మూడు నెలలకోసారి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే వారి సమస్యలు తెలుస్తాయని సూచించారు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే - mla aananad
ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం బస్సు ప్రయాణికుల సమస్యలు తెలుసుకోవడానికి వికారాబాద్ శాసనసభ్యుడు బస్సు ప్రయాణం చేశారు. ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ వరకు ప్రయాణించారు.

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ఎమ్మెల్యే ఆనంద్ ఈ రోజు బస్సు ప్రయాణానికి పూనుకున్నారు. అంతకుముందు బస్టాండ్‌ను పరిశీలించారు. మరుగుదొడ్లు ఎప్పుడు శుభ్రంగా ఉండాలన్నారు. బస్టాండ్ వెనుకవైపు మురుగు పేరుకుపోవడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ స్థలం ఎక్కువగా ఉన్నందున మొక్కలను నాటాలని కోరారు. ప్రయాణికుల సమస్యలు తెలుసుకునేందుకే బస్సు ప్రయాణం చేస్తున్నట్లు తెలిపారు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే
ఇవీ చూడండి: జాతీయ రోయింగ్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన మంత్రి