వికారాబాద్ జిల్లా పరిగిలో స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి దంపతులు ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ ఇంటి పరిసరాలతోపాటు పూల మెుక్కల కుండీలను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమం నిరంతరంగా పది వారాల పాటు కొనసాగించాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు.
'ప్రతి ఆదివారం పది నిమిషాలు'లో పాల్గొన్న ఎమ్మెల్యే కొప్పుల దంపతులు - mla koppula mahesh reddy couples participated on dryday program
పరిగిలోని స్వగృహంలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి దంపతులు ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా ఎమ్మెల్యే దంపతులు తమ ఇంటి పరిసరాలను శుభ్రం చేశారు.

Vikarabad district latest news
ప్రతి ఆదివారం కేవలం పది నిమిషాల సమయం ఇంటి శుభ్రత కోసం కేటాయిస్తే మలేరియా, డెంగీ లాంటి సీజనల్ వ్యాధులను అరికట్టడానికి వీలవుతుందని మహేశ్ రెడ్డి పేర్కొన్నారు.