తెలంగాణ

telangana

ETV Bharat / state

చిట్టెంపల్లి చెక్​పోస్టు​ను పరిశీలించిన ఐజీ

వికారాబాద్ జిల్లా చిట్టెంపల్లి చెక్​పోస్టు​ను ఐజీ శివశంకర్ రెడ్డి పరిశీలించారు. జిల్లాలో కఠినంగా లాక్​డౌన్​ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. విధుల్లో ఉన్న సిబ్బందికి డ్రై ఫ్రూట్స్, మాస్కులు, శానిటైజర్లు అందజేశారు.

ig shivashankar reddy visited at chittempalli check post, vikarabad lock down
చిట్టెంపల్లి చెక్​పోస్టులో ఐజీ తనిఖీలు, వికారాబాద్​లో లాక్​డౌన్

By

Published : May 26, 2021, 5:36 PM IST

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చిట్టెంపల్లి చెక్​పోస్టును ఐజీ శివశంకర్ రెడ్డి పరిశీలించారు. జిల్లాలో లాక్​డౌన్​ను పటిష్ఠంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి జాగ్రత్తలు చెప్పారు. వారికి డ్రై ఫ్రూట్స్, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు.

జిల్లాలో మొత్తం 7వేల వాహనాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు. మాస్కులు లేని వారికి జరిమానా విధిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం కర్ణాటక-తెలంగాణ సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్​పోస్టును పరిశీలించేందుకు వెళ్లారు.

ఇదీ చదవండి:Cabinet Meet: ఆదివారం మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం

ABOUT THE AUTHOR

...view details