తెలంగాణ

telangana

ETV Bharat / state

నోటీసులు ఇవ్వడానికి వెళితే.. మహిళా అధికారి అని చూడకుండా?

Vikarabad forest land grabbed: అటవీ భూమిని రెండెకరాలు కబ్జా చేసిన వ్యక్తికి నోటీసులు ఇవ్వడానికి వెళితే నోటికి వచ్చినట్లు దురుసుగా ప్రవర్తించాడు. మహిళా అధికారి అని చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. ఈ వ్యవహారంపై స్పందించిన అధికారులు చట్టప్రకారం అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Vikarabad forest land grabbed
అటవీ అధికారితో వాగ్వాదం

By

Published : Dec 3, 2022, 10:53 PM IST

Vikarabad forest land grabbed: వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవులకు అనుకొని ఉన్న హరివిల్లు రిసార్ట్స్​లో ఫారెస్ట్​కు సంబంధించి రెండు ఎకరాలు భూమి ఆక్రమణకు గురైనట్లు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే ఆక్రమణకు సంబంధించి హరివిల్లు రిసార్ట్స్ యజమాని గంగాధర్​ రావుకు ఫారెస్ట్ సిబ్బంది నోటీసు ఇవ్వడానికి వెళ్లగా.. వారితో దురుసుగా ప్రవర్తించారని ఎఫ్​ఆర్​ఓ అరుణ తెలిపారు. అదీకాకుండా నోటీసులను సైతం సిబ్బంది ముఖంపై విసిరి కొట్టారని ఎఫ్ఆర్ఓ పేర్కొన్నారు.

అటవీ భూమిని ఆక్రమించడమే కాకుండా సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన గంగాధర్​ రావుపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటికే హరివిల్లు రిసార్ట్స్ యజమానిని అనేక సార్లు హెచ్చరించామని, వాటిని పట్టించుకోకుండా అలాగే రిసార్ట్స్​ను కొనసాగిస్తున్నారని తెలిపారు. అక్రమించడమే కాకుండా సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంపై చర్యలు తీసుకుంటామన్నారు.

అనంతగిరి అటవీ సమీపంలో ఉన్న హరివిల్లు రిసార్ట్స్​ రెండు ఎకరాల భూమి కబ్జా గురైనట్టు మా దృష్టికి వచ్చిందని జిల్లా ఫారెస్ట్ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన ఫారెస్ట్​ సిబ్బంది సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం వచ్చిందని, ఫారెస్ట్ చట్ట ప్రకారం అతనిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. మహిళా అధికారి అని చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేసిన అతనిని చట్ట ప్రకారం శిక్షిస్తామన్నారు.

నోటీసులు ఇవ్వడానికి వెళితే అధికారిపై దురుసుగా ప్రవర్తిస్తున్న రిసార్ట్స్​ యజమాని

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details