సూర్యాపేట జిల్లా కోదాడలో ఇంటింటికీ కాంగ్రెస్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కాంగ్రెస్ జెండా ఎగరేశారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా పండుగ మూడురోజుల పాటు నిర్వహించనున్నామని స్పష్టం చేశారు.
పుర ఎన్నికల్లో తెరాస జెండా ఎగరాలని కేసీఆర్ కలలు కంటున్నారని..అందుకే ఇష్టారీతిలో రిజర్వేషన్లు పెట్టి ఓట్లను తారుమారు చేస్తున్నారని మండిపడ్డారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కోదాడ నుంచే కాంగ్రెస్ జెండా ఎగరబోతోందని పద్మావతి ధీమా వ్యక్తం చేశారు.
కోదాడ పురపాలికపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం.. - కోదాడ
కాంగ్రెస్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జెండా పండుగను నిర్వహించనున్నామని కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తెలిపారు. పుర ఎన్నికల్లో కోదాడ నుంచే కాంగ్రెస్ తొలి జెండా ఎగరబోతోందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

కోదాడ నుంచే కాంగ్రెస్ తొలి జెండా ఎగరబోతోంది : పద్మావతి రెడ్డి
కోదాడ నుంచే కాంగ్రెస్ తొలి జెండా ఎగరబోతోంది : పద్మావతి రెడ్డి
ఇవీ చూడండి : ఖమ్మం కార్పొరేషన్లో కాక పుట్టిస్తోన్న అసమ్మతి