parents complaints on his son: కనిపెంచిన తల్లిదండ్రులను పోషించడాన్ని నేటి రోజుల్లో భారంగా ఫీలవుతున్నారు. వారికి బుక్కెడు అన్నం పెట్టడానికి మనసు రాక వీధిన పడేస్తున్నారు. కన్న తల్లిదండ్రులని చూడకుండా ఆస్తి, పాస్తులని లెక్కలేసుకుని గిరిగీసుకుని బతుకుతున్నారు. కన్నవారికి కొంచెం అన్నం పెట్టలేక వంతులేసుకొని వారిని భారంగా సాకుతున్నారు. తల్లిదండ్రుల పేరు మీద ఆస్తులున్నంత వరకే వారికి విలువ ఇస్తున్నారు. ఏదో ఒక కాకమ్మ కథ చెప్పి వారి నుంచి ఆస్తి తీసేసుకుని చివరకు అక్కర్లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. వృద్ధాప్యంలో ఒక్క పూట అన్నం కోసం చేయి చాచి అడుక్కోవాల్సిన పరిస్థితిని తీసుకొస్తున్నారు. వారి గోడు ఎవరికీ విన్నవించుకోవాలో తెలియక తల్లిదండ్రులు కన్న కష్టాలు పడుతున్నారు. అలాంటి సంఘటనే సూర్యాపేటలో జరిగింది.
వృద్ధ దంపతులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల మండల కేంద్రానికి చెందిన గురువోజు గోపయ్య(90), సోమక్క (88) అనే వృద్ధ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. పెద్దకుమారుడు ఉద్యోగరీత్యా దూరంగా ఉంటున్నాడు. చిన్నకుమారుడే గత 30 ఏళ్లుగా వీరి మంచి చెడు చూస్తున్నాడు. చివరి దశలో తల్లిదండ్రుల బాగోగులను చూడటం ఇబ్బందిగా ఉందని అతను పెద్దమనుషులను ఆశ్రయించాడు. తల్లిదండ్రుల పేరిట ఉన్న 2.33 ఎకరాల భూమిని తన పేరిట పట్టాచేస్తే తాను చూసుకుంటానని పెద్దకుమారుడు సోమాచారి పెద్ద మనుషుల సమక్షంలో చెప్పాడు.