సూర్యాపేట జిల్లాలో మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పర్యటించారు. చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి, పెన్పహడ్ మండలం ధర్మాపురంలో స్థానిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత పాలకుల నిర్లక్ష్యంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడి, ప్రజలు వలసల బాట పట్టారని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా తెరాస అభ్యర్థులను అత్యధిక మెజర్టీతో గెలిపించాలని కోరారు.
తెరాసతోనే గ్రామాల అభివృద్ధి: జగదీష్ రెడ్డి
పల్లెల్లో స్థానిక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. సూర్యాపేట జిల్లాలో తెరాస అభ్యర్థుల తరఫున మంత్రి జగదీష్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారం