తెలంగాణ

telangana

By

Published : Sep 28, 2020, 12:53 PM IST

ETV Bharat / state

కర్జూర పండ్లతో రోగ నిరోధక శక్తి పెరుగుదల

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం తూర్పుగూడెం గ్రామంలో ఆదివారం వెయ్యి కర్జూర మొక్కలు నాటారు. స్థానిక గౌడ సంఘం ఆధ్వర్యంలో చెరువు కట్టకి ఇరువైపులా సర్పంచ్ ఈ కార్యక్రమం చేపట్టారు.

local-gouda-community-planted-date-plants-in-thurpugudem-village-suryapet-district
కర్జూర పండ్లతో రోగ నిరోధక శక్తి పెరుగుదల

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం తూర్పు గూడెం గ్రామంలో వెయ్యి కర్జూర మొక్కలు నాటారు. స్థానిక గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం చెరువు కట్టకి ఇరువైపులా సర్పంచ్ గుండగాని శ్రీనివాస్ గౌడ్ ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మొక్కలు నాటారు.

కర్జూర పండ్లు మనిషికి బలవర్ధక ఆహారం

మన తాతలు నాటిన తాటి చెట్లను మనం సాగు చేస్తున్నామనీ, అలాగే మనం నాటిన మొక్కలు భవిష్యత్ తరాలకి ఉపయోగపడతాయని సర్పంచ్ అన్నారు. కర్జూర పండ్లు మనిషికి బలవర్ధక ఆహారమనీ, వీటిని తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. ఈ మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అబ్కారీ సీఐ బాలోజి నాయక్, గౌడ సంఘం సొసైటీ సభ్యులు గుండ్ల మల్లయ్య, గుండగాని గోపాల్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ప్రకృతి వనాలతో.. పల్లెలకు కొత్త కళ

ABOUT THE AUTHOR

...view details