సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం లింగగిరి గ్రామ పంచాయతీకి ప్రభుత్వం కేటాయించిన ట్రాక్టర్లో అందరూ చూస్తుండగానే యథేచ్ఛగా మద్యం తరలించారు. గ్రామపంచాయతీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి మద్యం సరఫరా చేస్తున్నట్లు సమాచారం.
గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో మద్యం తరలింపు - liquor news at huzurnagar
గ్రామ పంచాయతీకి ప్రభుత్వం కేటాయించిన ట్రాక్టర్లో మద్యం తరలిస్తున్న ఘటన హుజూర్నగర్ మండలం లింగగిరి గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే యథేచ్ఛగా మద్యం తరలించారు.

గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో మద్యం తరలింపు
ట్రాక్టర్ను గ్రామ పారిశుద్ధ్య పనులకు ఉపయోగించాలి కానీ ఇలా మద్యం సరఫరాకు ఉపయోగించడం ఏంటని స్థానికులు మండిపడుతున్నారు.