తెలంగాణ

telangana

ETV Bharat / state

జీతం పెంచితేనే విధుల్లోకి వస్తాం: బస్సు​ డ్రైవర్లు

రోజుకు 16 గంటల డ్యూటీ చేయిస్తూ తక్కువ జీతం ఇస్తూ కార్మికుల బతుకులతో ప్రైవేట్​ బస్సుల యాజమాన్యం ఆడుకుంటోందంటున్నారు డ్రైవర్లు. సూర్యాపేట జిల్లా కోదాడ బస్​ డిపోలో జీతాలు పెంచాలంటూ వారు ధర్నా చేశారు.

కోదాడ బస్టాండ్ లో ప్రైవేట్ బస్ డ్రైవర్ల ధర్న

By

Published : Apr 24, 2019, 11:05 AM IST

పేద కార్మికుల బతుకులతో ప్రైవేటు బస్సుల యాజమాన్యం ఆడుకుంటోందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ బస్​ డిపోలో 32 ప్రైవేటు బస్సుల్లో పనిచేసే వంద మంది డ్రైవర్లు ధర్నాకు దిగారు. యాజమాన్యం రోజుకు 16 గంటల పని చేయిస్తూ తక్కువ జీతం ఇస్తోందని ఆరోపించారు.

తక్షణమే పరిష్కరించాలి...

ఈ నెల 15లోపు సమస్యను పరష్కరిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మార్వో మాట నిలబెట్టుకోలేదన్నారు. తమకు వెంటనే తగిన న్యాయం చేయాలని అధికారులను కోరారు.

కోదాడ బస్టాండ్ లో ప్రైవేట్ బస్ డ్రైవర్ల ధర్న

ఇదీ చదవండిః ప్రశాంతంగా ఓపెన్​ స్కూల్​ పరీక్షలు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details