తెలంగాణ

telangana

ETV Bharat / state

"నా భార్య, అత్త వేధింపులు తాళలేకే చనిపోతున్నా.." - సూర్యాపేటలో నవ వరుడు ఆత్మహత్య

"నా చావుకు నా భార్య, వాళ్ల అమ్మ, వాళ్ల బంధువులే కారణం. నాలో లేని లోపాన్ని ఎత్తి చూపుతున్నారు. నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. అందుకే నేనీ నిర్ణయం తీసుకుంటున్నాను. అమ్మ, నా కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగితే నన్ను క్షమించండి. ఎందుకంటే నా జీవితంలో ఎక్కను.. అనుకున్న పోలీసు స్టేషన్‌ మెట్లు ఎక్కించింది. నా కుటుంబంలో, నా స్నేహితుల్లో లేని అనుమానాలు సృష్టించింది. నన్ను నలుగురిలో అవమానపరిచింది. సమాజంలో తలెత్తుకోకుండా చేసింది. మనసులో ఒకరిని పెట్టుకొని నా జీవితం నాశనం చేసింది. అందుకే ఈ నిర్ణయం'’  - నవ వరుడు రాసిన స్వీయ లేఖ

Bride g
Bride g

By

Published : Jan 6, 2020, 12:51 PM IST

నవ వరుడు రాసిన స్వీయ లేఖ

సూర్యాపేటలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లైన నెల రోజులలోపే ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడాడు. పట్టణంలో శ్రీరాంనగర్‌కు చెందిన వంగపల్లి అర్జున్‌కుమార్‌ వివాహం డిసెంబర్‌ 8న ఆత్మకూర్‌ (ఎస్‌) మండలానికి చెందిన యువతితో జరిగింది. డిసెంబరు 26న అర్జున్‌కుమార్‌ సంసారానికి పనికిరాడని ఆ యువతి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆత్మకూర్‌ (ఎస్‌) పోలీసు స్టేషన్​లో మోసం చేసి పెళ్లిచేశారని అర్జున్‌కుమార్‌తో పాటు తల్లి, సోదరుడు, అక్కబావలపై ఫిర్యాదు చేసింది.

ఈనెల 3న పోలీసులు వీరిని కౌన్సెలింగ్‌కు ఠాణాకు పిలిచారు. పెద్ద మనుషుల సమక్షంలో అతని భార్య, అత్త హేళనగా మాట్లాడారు. ఈనెల 11న మరోసారి కౌన్సెలింగ్‌కు రావాలని చెప్పి పంపించారు. మనస్తాపం చెందిన అర్జున్‌కుమార్‌ శనివారం రాత్రి పడక గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని చీరతో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనుమానం వచ్చి ఎంత పిలిచినా స్పందించకపోవటం వల్ల బలవంతంగా తలుపులు తెరిచి చూసేసరికి ఫ్యానుకు వేలాడుతూ కనిపించారు. వెంటనే కిందికి దించి 108 వాహనంలో సూర్యాపేట జనరల్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అతని జేబులో స్వీయలేఖను బంధువులు గుర్తించారు. మృతుడి తల్లి వంగపల్లి రమాదేవి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీచూడండి: ఆన్​లైన్​ ఆఫర్లే గాలం... మార్కెట్​లోకి సరికొత్త సైబర్​మోసం!

ABOUT THE AUTHOR

...view details