సూర్యాపేట జిల్లా కోదాడలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు గత అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగారు. డిపో ముందు ఆందోళన చేపట్టారు. కోదాడ డిపోలో ఉన్న 93 బస్సులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. డిపోలో అర్ధరాత్రి నుంచి పోలీసులు పహారా కాస్తున్నారు. ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడం వల్ల ప్రైవేట్ వాహనాలకు గిరాకీ పెరిగింది. ఇదే అదనుగా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
కోదాడలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన - కోదాడ
తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. సూర్యాపేట జిల్లా కోదాడలో కార్మికులు విధుల బహిష్కరించి ఆందోళన చేపట్టారు

కోదాడలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన