ఊరి కోసం ఏమైనా చేయాలనే తపన ఆ యువకుడిని కదిలించింది. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలకు తన వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. తొగుట మండలం గణపురం గ్రామానికి చెందిన రామస్వామి.. ఆ గ్రామంలోని 400 పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశాడు. ప్రతి ఒక్కరు తమ తమ బాధ్యతగా పేదలకు తోచినంత సహాయం చేయాలని కోరాడు.
400 నిరుపేద కుటుంబాలకు సరుకుల పంపిణీ - సిద్దిపేట జిల్లా వార్తలు
సిద్దిపేట జిల్లా తొగుట మండలం గణపురం గ్రామానికి చెందిన రామస్వామి అనే యువకుడు 400 పేద కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశాడు. పుట్టి పెరిగిన ఊర్లో ప్రజలు లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడటం చూసి.. తన మిత్రులతో కలిసి వారానికి సరిపడ సరుకులను అందజేశాడు.

young man distributed groceries
Last Updated : Apr 20, 2020, 12:32 PM IST