సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గండిపల్లిలో గిరిజన మహిళా ఎంపీటీసీపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని కోరుతూ హుస్నాబాద్ ఏసీపీ మహేందర్‌కు గిరిజన సంఘాల నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ నెల 11న గండిపల్లిలో జరిగిన గ్రామ సభలో పంచాయతీ లెక్కలు అడిగినందుకు సర్పంచ్ భర్త, ఉపసర్పంచ్ కలిసి గిరిజన మహిళా ఎంపీటీసీని తీవ్ర పదజాలంతో దూషిస్తూ... చీర లాగడంపై రాష్ట్ర గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షుడు తిరుపతి నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
'మహిళా ఎంపీటీసీపై దాడిచేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి'
గిరిజన మహిళా ఎంపీటీసీపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ గిరిజన సంఘాల నాయకులు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఏసీపీకి వినతిపత్రం అందించారు. గ్రామ పంచాయతీ లెక్కలు అడిగినందుకు మహిళ అని కూడా చూడకుండా దాడికి తెగబడటంపై నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
tribal associations Denied attack on women mptc
అదే రోజు బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా... ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు... ఇప్పటివరకు నిందితులను అరెస్టు చేయలేదని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి రిమాండుకు తరలించాలని డిమాండ్ చేశారు.