ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామం వెళ్లనున్నారు. గ్రామస్థులతో కలసి సహపంక్తి భోజనం చేసి అభివృద్ధి అంశాలు, సమస్యల పై ముచ్చటించనున్నారు. 2018 శాసనసభ ఎన్నికల సమయంలో చింతమడకలో ఓటు వినియోగించుకున్న సీఎం. ఆనాడు గ్రామస్థులతో వివిధ కార్యక్రమాలపై వీలు చూసుకుని వచ్చి చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఈమేరకు ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో మాజీమంత్రి హరీశ్ రావు, కలెక్టర్ వెంకటరామరెడ్డి అన్ని ఏర్పాట్లు చేసి సమీక్షించారు. చింతమడక గ్రామం అభివృద్ధి, అవసరాలు, సమస్యల నివేదిక రూపొందించాలని అధికారులను హరీశ్ రావు ఆదేశించారు. చెరువులు, కాలువలు, గొలుసుకట్టు చెరువుల వివరాలు కూడా ఇవ్వమని సూచించారు.
ఈవారంలో స్వగ్రామానికి సీఎం...! - trs president
సీఎం కేసీఆర్ ఈ వారంలో స్వగ్రామం చింతమడకలో పర్యటించనున్నారు. అనంతరం గ్రామస్థులతో అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యల గురించి చర్చించనున్నారు.
స్వగ్రామానికి సీఎం...!