గజ్వేల్ పట్టణంలో రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు సమస్యలపై ఒకరోజు నిరసన దీక్ష చేపడుతున్నట్లు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి ప్రకటించారు. మొదటి సారిగా ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించి గజ్వేల్లో నిర్వహించిన విజయోత్సవ సభలో కేసీఆర్ గజ్వేల్ పట్టణ ప్రజలకు 5వేల ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. కానీ నేటికీ ఐదుగురికి కూడా ఇల్లు ఇవ్వలేకపోయారని ఆరోపించారు. పట్టణంలో 1200 ఇళ్ల నిర్మాణం చేపట్టినప్పటికీ ప్రజలకు ఇవ్వకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. వాటిని వినియోగించుకోవడం వల్ల శిథిలావస్థకు చేరుకుని కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. తాము చేపట్టే నిరసన దీక్షకు పట్టణ ప్రజలంతా సంపూర్ణ మద్దతును ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
'గజ్వేల్లో ముఖ్యమంత్రి ఐదుగురికి కూడా ఇళ్లు ఇవ్వలేదు'
గజ్వేల్లో 5 వేల మందికి రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్... నేటికీ 5గురికి కూడా ఇవ్వలేకపోయారని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి విమర్శించారు. ఇళ్ల కేటాయింపు సమస్యలపై ఒకరోజు నిరసన దీక్ష చేపడుతున్నట్లు వెల్లడించారు.
'గజ్వేల్లో ముఖ్యమంత్రి ఐదుగురికి కూడా ఇళ్లు ఇవ్వలేదు'