కరోనానేపథ్యంలో బ్యాంకు సేవలనుచాలా వరకు ఆన్‌లైన్‌లోనేనిర్వహించుకోవచ్చని SBIస్పష్టంది.నామినీమార్చుకోవడం, బ్యాంకుశాఖలను మార్పు చేసుకునేవెసులుబాటు కల్పిస్తున్నట్లు SBI ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఫలితంగావినియోగదారులు బ్యాంకులకువెల్లకుండానే పలు రకాల సేవలుపొందవచ్చని తెలిపారు .అలాగేనామినీ ,ఆధార్‌లింక్ విధానాన్ని కూడా కొంతకాలం పాటు SBI నిలుపుదలచేసింది. అటు సిద్దిపేట పట్టణంలో కొత్తగా నిర్మితమైన భవనంలో భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రాంతీయ వ్యాపార కార్యాలయాన్ని మంత్రి హరీష్ రావు, ఎస్బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఓం ప్రకాష్ మిశ్రా ప్రారంభించారు.
SBI:సేవలు ఆన్‌లైన్‌లో.. ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహకరిస్తాం
ఖాతాదారులకు మరింత దగ్గరై మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధిపేటలో భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రాంతీయ వ్యాపార కార్యాలయాన్న నిర్మించామని ఎస్బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరక్టర్ తెలిపారు.కరోనా నేపథ్యంలో బ్యాంకు సేవలను చాలా వరకు ఆన్‌లైన్‌లోనే నిర్వహించుకోవచ్చని SBI స్పష్టం చేసింది.
రామచంద్రాపురం నుంచి కొనసాగుతున్న ప్రాంతీయ కార్యాలయాన్ని కొత్తగా నిర్మితమైన కొత్త భవనంలోకి పూర్తిగా మార్చుతున్నట్లు మిశ్రా తెలిపారు. సిద్ధిపేటలోని ఈ కార్యాలయం నుంచే అన్ని రకాల రుణాలు ఇక్కడ నుంచే ప్రాసెసింగ్ అవుతాయన్నారు. వ్యవసాయ రుణాలు, స్వయం సహాయక రుణాలు వంటివి కూడా ఇక్కడి నుంచే కొనసాగిస్తారని తెలిపారు. ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో తమ బ్యాంకు ముందుందని ఆయన వివరించారు. ఖాతాదారులకు మరింత దగ్గరై మెరుగైన సేవలందించేందుకు కొత్తగా నిర్మితమైన ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి:Huzurabad: ఈటల రాజీనామా... హుజూరాబాద్‌పై తెరాస దృష్టి