సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్లోని కోమటికుంటకు ప్రమాదం పొంచి ఉంది. మిషన్ కాకతీయ కింద ఇటీవలే రూ.17 లక్షల వ్యయంలో మరమ్మతులు చేశారు. తాజాగా కురిసిన వర్షాలతో చెరువు నిండిపోయింది. పనులు నాసిరకంగా ఉన్నందున కట్ట మొత్తం నెర్రెలు వచ్చాయి. ఒకచోట మరీ కుంగినందున గండి పడే ప్రమాదముంది. కోమటి చెరువు కుంట నిండిందని ఆయకట్టు రైతులు 100 ఎకరాల్లో నాట్లు వేసి పొలం పనులు ప్రారంభించారు. ఇప్పుడు కట్ట తెగితే ఆయకట్టు కింద సాగు చేస్తున్న రైతులు నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి కట్ట మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
కోమటికుంట కట్టకు పొంచి ఉన్న ప్రమాదం - సిద్దిపేట జిల్లా
తాజాగా కురిసిన వర్షాలకు సిద్దిపేట జిల్లా ఉమ్మాపూర్లోని కోమటికుంటకు కట్టపై నెర్రెలు వచ్చాయి. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

కోమటికుంట కట్టకు పొంచి ఉన్న ప్రమాదం