తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతులు అదనపు ఆదాయం పొందాలన్నదే లక్ష్యం'

సిద్దిపేటలో పశువైద్య శాఖ, పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య సంయుక్తంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు మంత్రి హరీశ్​రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రెండో విడత గొర్రెల కోసం డీడీలు కట్టాలని సూచించారు.

'రైతులు అదనపు ఆదాయం పొందాలన్నదే లక్ష్యం'

By

Published : Oct 17, 2019, 11:57 PM IST

రాష్ట్రంలో పాడి సంపద పెరిగి... రైతులు అదనపు ఆదాయం పొందాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనని మంత్రి హరీశ్​రావు వెల్లడించారు. సిద్దిపేటలోని కొండ భూదేవి గార్డెన్​లో ఏర్పాటు చేసిన పశు వైద్య శాఖ, పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా మంత్రి హాజరయ్యారు. తెలంగాణలో గత సంవత్సరం నుంచి 45 శాతం గొర్రెల సంపద, 5 శాతం పాడి పరిశ్రమ పెరిగిందని మంత్రి హరీశ్​రావు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మంత్రులు తెలంగాణ పథకాలు అద్భుతమంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారని వివరించారు. ప్రతి ఒక్కరూ రెండో విడత గొర్రెల కోసం డీడీలు కట్టాలని... కట్టిన వాళ్లకు త్వరలోనే గొర్రెలు పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ రోజా శర్మ, పశువైద్య అధికారులు పాల్గొన్నారు.

'రైతులు అదనపు ఆదాయం పొందాలన్నదే లక్ష్యం'

ABOUT THE AUTHOR

...view details